'ఓజీ' టీజర్ 'ది బెస్ట్' అంటున్నారే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఓజీ’ నుంచి సెప్టెంబర్ 2న గ్లింప్స్ వీడియో వచ్చింది.

By Medi Samrat  Published on  2 Sept 2023 4:32 PM IST
ఓజీ టీజర్ ది బెస్ట్ అంటున్నారే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఓజీ’ నుంచి సెప్టెంబర్ 2న గ్లింప్స్ వీడియో వచ్చింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. హంగ్రీ చీతా పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. యాక్షన్ మోడ్‍లో గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కళ్యాణ్ సత్తా చూపించాడు. పవర్ స్టార్ అభిమానులతో పాటు సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది.

పవర్ ఫుల్ డైలాగ్‍లతో ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. బాంబేలో పదేళ్ల క్రితం నరికిన మనుషుల రక్తాన్ని తుఫాన్ కూడా కడగలేకపోయిందని ఉండే డైలాగ్ గూజ్‍బంప్స్ తెప్పించింది. పవన్ కళ్యాణ్ కత్తితో ఫైట్ చేయడం, గన్ చేత పట్టుకోవడం, ఆయన స్టైలిష్ వాక్ అదిరిపోయాయి. థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.


ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి వచ్చిన టీజర్లలో.. OG టీజర్ నిస్సందేహంగా ది బెస్ట్ అని చెప్పొచ్చు. టీజర్ లో పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్, గ్రాండియర్, క్వాలిటీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ గా పవర్ ఫుల్ గా కనిపించాడు. గన్‌తో ఆయన ఎంట్రీ షాట్‌ టీజర్‌కే హైలైట్‌. ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story