హమ్మయ్య.. డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరి హర వీర మల్లు - పార్ట్ 1. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం రెండు వారాల కంటే తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

By Medi Samrat
Published on : 29 May 2025 6:57 PM IST

హమ్మయ్య.. డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరి హర వీర మల్లు - పార్ట్ 1. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం రెండు వారాల కంటే తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఓ గుడ్ న్యూస్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు.

ఈ సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా ఆక‌ట్టుకోలేదు. అయితే అభిమానులు ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ప్రేక్షకులలో అవసరమైన బజ్‌ను తీసుకువస్తుందని ఆశిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లముడి నుండి ఈ ప్రాజెక్ట్‌ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం టిక్కెట్ల అమ్మకాలు ఇప్పటికే విదేశాలలో ప్రారంభమయ్యాయి, కానీ భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు.

Next Story