సీనియ‌ర్ న‌టులు ఒక్కొక్క‌రుగా కాలం చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan tribute senior actor chalapathi rao.చ‌ల‌ప‌తి రావు మృతితో తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురైన‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 9:30 AM IST
సీనియ‌ర్ న‌టులు ఒక్కొక్క‌రుగా కాలం చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తి రావు మృతితో తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురైన‌ట్లు, న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. "ప్ర‌ముఖ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మృతి చెంద‌డం బాధాక‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లోనే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన శైలిలో ఆయ‌న ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. నిర్మాత‌గా ఎన్నో మంచి చిత్రాల‌ను నిర్మించారు. ఆయ‌న కుమారుడు, న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక త‌రానికి ప్ర‌తినిధులుగా ఉన్న సీనియ‌ర్ న‌టులు ఒక్కొక్క‌రుగా ఇలా కాలం చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం." అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

సీనియర్‌ నటుడు చలపతిరావు ఆదివారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అమెరికాలో ఉంటున్న ఆయ‌న కుమార్తెలు రాగానే బుధ‌వారం జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో చ‌ల‌ప‌తిరావు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలియ‌జేశారు. అభిమానుల సంద‌ర్శ‌నార్థం ర‌విబాబు నివాసంలోనే ఆయ‌న భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నారు.

Next Story