పవన్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు
Pawan Kalyan Sujeeth Movie Update. దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు.
By Sumanth Varma k
దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారు. RRR వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించిన డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జనవరి 30 సోమవారం ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పోస్టర్ లో పవన్ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తున్నాడు. పైగా పవన్ ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నట్లు పోస్టర్ ను డిజైన్ చేశారు. దీనికి తోడు పోస్టర్ అంతా ఎర్రగా కనిపిస్తుంది. అగ్ని తుపాను రానుందని, వాళ్లందరూ అతన్ని ఓజీ అని పిలుస్తారు అని కూడా పోస్టర్‌లో రాసి ఉంది. మరీ ఈ పోస్టర్ కి అర్ధం ఏమిటో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక పవన్ - సుజిత్ కలయికలో వస్తున్న ఈ సినిమాకు రవి. కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నాడు. ఐతే, ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరు ?, అలాగే సినిమాలోని మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు ? లాంటి పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది. నిజానికి గతంలో ఈ కాంబినేషన్ నుంచి ఓ తమిళ చిత్రం రీమేక్ రాబోతుంది అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ, దర్శకుడు సుజిత్ పవన్ కోసం ఫ్రెష్ సబ్జెక్ట్ తయారు చేశాడని టాక్.