రానా, మహేష్‌లకు క్రిస్మస్ కానుకలు పంపిన పవర్ స్టార్!
Pawan Kalyan Send Christmas Gift To Rana And Mahesh. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ క్రైస్తవులు ఎంతో ఘనంగా
By Medi Samrat Published on 25 Dec 2020 9:27 AM IST
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు తమ బంధువులకు, స్నేహితులకు బహుమతులను పంపుతూ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవాలు సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులకు, అలాగే రానా, మిహికా దంపతులకు కానుకలను పంపించి ప్రత్యేక గ్రీటింగ్ కార్డుల ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కానుకలను అందుకున్న మహేష్ బాబు భార్య నమ్రత స్పందించి "మీకు అంతా మంచే జరగాలంటూ" ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే ఈ విషయంపై దంపతులు స్పందిస్తూ... మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రానా చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.
సినిమాల విషయానికి వస్తే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మంచి స్నేహితులు అని చెప్పవచ్చు. 2008లో విడుదలైన జల్సా సినిమా కి మహేష్ బాబు ఓవర్ వాయిస్ ఇవ్వడం మనకు తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు కీర్తి సురేష్ తో కలిసి" సర్కారీ వారి పాట" చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్" చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం పూర్తవగానే సాగర్ చంద్ర దర్శకత్వంలో "అయ్యప్పనుమ్ కోషియుమ్"తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారని టాలీవుడ్ సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న "వకీల్ సాబ్"చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తొందర్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపారు.