ది బెస్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే
Pawan Kalyan, Sai Dharam Tej Bro Movie. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో: ది అవతార్.
By Medi Samrat
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో: ది అవతార్. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ గెస్ట్ రోల్ అని చెప్పారు కానీ.. సినిమా మొత్తం కనిపించడం విశేషం. ఈ చిత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్స్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ ను సాధించింది. త్రివిక్రమ్ డైలాగ్‌లు పవన్ కళ్యాణ్ నోట పలకడం, వింటేజ్ సాంగ్స్ అండ్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించడం అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్, చరిష్మా సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్ళింది. కంటెంట్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన అభిమానులకు అసలైన ట్రీట్. పవన్ డ్యాన్స్, కామెడీ, డైలాగ్‌లతో మాయ చేస్తాడు. పవన్ ఈ చిత్రానికి 100% పైగా న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఈ చిత్రం ఖచ్చితంగా అభిమానులకు సంతృప్తిని ఇస్తుంది.
ఇక మార్క్(మార్కండేయ) పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడు. అతనికి తల్లి, ఇద్దరు చెల్లెల్లు, యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న ఒక తమ్ముడు ఉంటాడు. అతని కుటుంబానికి ఏకైక ఆధారం అతడే. కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై పూర్తి నియంత్రణ ఉందని అనుకుంటూ ఉండే అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. తన పెళ్లికాని చెల్లెల్లు, అతని తల్లి తాను లేకుంటే ఏమైపోతారోనని టెన్షన్ పడి.. టైటాన్ (పవన్ కళ్యాణ్)ని మార్క్ వేడుకుంటాడు. అప్పుడు మార్కండేయ జీవితకాలాన్ని 90 రోజులు పొడిగిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సాగించే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు.