గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "మూలాలను మరచిపోవద్దు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి వల్లనే నేను నటుడిగా, ఉప ముఖ్యమంత్రిని అయ్యాను. రామ్ చరణ్ విజయానికి, మెగా అభిమానుల తిరుగు లేని మద్దతు వెనుక ఆయనే కారణం." అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. చాలా మంది ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్‌కి కౌంటర్ అని అంటున్నారు.
అల్లు అర్జున్ వైఖరిలో ఇటీవల చాలా మార్పు కనిపిస్తోందనే చర్చ సినీ అభిమానుల మధ్య జరుగుతూ ఉంది. పుష్ప ఈవెంట్స్ లో "అల్లు ఆర్మీ" అని నొక్కి మరీ చెప్పాడు. చిరంజీవి లేదా ఇతర మెగా హీరోలను ఉద్దేశించి మాట్లాడలేదు. పుష్ప-2 హిట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగినా మెగా హీరోల నుండి అనుకున్నంత మద్దతు రాలేదు.