హరిహర వీరమల్లు టీజర్ డేట్‌ ఫిక్స్ అయ్యిందా..?

Pawan Kalyan Harihara Veeramallu Teaser. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లుపై

By Medi Samrat
Published on : 20 Jan 2023 7:09 PM IST

హరిహర వీరమల్లు టీజర్ డేట్‌ ఫిక్స్ అయ్యిందా..?

పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. హరిహర వీరమల్లుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. హరి హర వీరమల్లు టీజర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. చాలా గ్యాప్ తర్వాత పవన్ యాక్షన్ చేయనున్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ స్టంట్స్ స్వయంగా చేస్తున్నాడు. పవన్ పాత్ర తన అభిమానులకు నచ్చేలా చేయడంతో పాటు.. ఆయన పొలిటికల్ కెరీర్‌కు చాలా మైలేజ్ వచ్చేలా ఉండనుందని చెబుతూ ఉన్నారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌పై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రానుంది.

Next Story