సమస్య మొత్తం హీరో మీద వేసి ఒంటరిని చేసేశారు.. సంధ్య థియేటర్ ఘటనపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  30 Dec 2024 3:20 PM IST
సమస్య మొత్తం హీరో మీద వేసి ఒంటరిని చేసేశారు.. సంధ్య థియేటర్ ఘటనపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ స్పందించారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్.. వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదన్నారు. బెనిఫిట్ షోలు అధిక ధరలు ఉనప్పుడు కలెక్షన్స్ రికార్డుస్థాయిలో వస్తాయ‌న్నారు. సలార్, పుష్ప సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్ లు వచ్చాయన్నారు. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు.. సినిమా థియేటర్లకు హీరోస్ వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. నేను మొదట్లో మూడు సినిమాలకి వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయానన్నారు. అల్లు అర్జున్‌కు స్టాఫ్ చెప్పి ఉండాల్సింది.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాప్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. చనిపోవడం చాలా బాధాకరం.. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్లి సపోర్ట్ ఇవ్వాల్సింది.. మీ బాధలో మేమున్నాము అని భ‌రోసా ఇవ్వాల్సింది.. అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా మిగిలిన వాళ్ళు వెళ్ళాల్సింది.. అలా వెళ్ళకపోవడం పొగరు అనుకుంటారు.. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి మద్దతు ఉండాలన్నారు. ప్రత్యక్షంగా కారణం కాకపోయినా యూనిట్ మొత్తం మద్దతు ఇవ్వాల్సింది.. అలా చెయ్యకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేశారు.. సినిమా అనేది టీమ్.. హీరోని ఒంటరిని చేసేశారన్నారు.

రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని బానే ప్రోత్సహించారు.. బెనిఫిట్ షో అధిక ధరలకు అనుమతి ఇచ్చారు కదా.. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారని అనుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి వాటినన్నింటినీ మించిన నాయకుడు అన్నారు. రేవంత్ రెడ్డి నాకు చాలా కాలంగా తెలుసు.. వన్స్ కేసు నమోదు అయ్యాక చట్ట ప్రకారం జరిగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డిని తప్పు బట్టలేము ఆస్థానంలో ఎవరున్నా చట్ట ప్రకారం ఫాలో అవుతారు. లాలూచీ పడితే మీడియా ప్రజలు తిట్టారా.. అది పెద్ద డిఫికల్ట్ పరిస్థితి అన్నారు.

Next Story