కోపాన్ని దాచుకోవడం రాయలసీమ ప్రజలను చూసి నేర్చుకోవాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Comments On Rayalaseema. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు తథ్యమని.. మార్పు కోసమే మనమంతా తపిస్తున్నామని

By Medi Samrat  Published on  2 Oct 2021 12:36 PM GMT
కోపాన్ని దాచుకోవడం రాయలసీమ ప్రజలను చూసి నేర్చుకోవాలి : పవన్ కళ్యాణ్

2024 ఎన్నికల్లో జనసేన గెలుపు తథ్యమని.. మార్పు కోసమే మనమంతా తపిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ధవళేశ్వరంలో లక్ష మందితో జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని.. 4 వేలకు పైగా వాహనాలను అడ్డుకున్నారని రాజమహేంద్రవరంలో జనసేనాని ఆరోపించారు. ప్రతి జనసైనికుడిలో ఎంత కోపం ఉందో తనకు తెలుసని అయితే అందరూ ఆ కోపాన్ని దాచుకోవాలని చెప్పారు. కోపాన్ని తారాజువ్వలా వదిలేస్తే ఆ తర్వాత వెంటనే కిందకు పడుతుందని.. కోపాన్ని దాచుకోవడం రాయలసీమ ప్రజలను చూసి నేర్చుకోవాలని చెప్పారు. సీమ ప్రజలు తమ కోపాన్ని రెండు, మూడు తరాలు కూడా దాచుకుంటారని అన్నారు. గోదావరి జిల్లాల ప్రజలు కూడా కోపాన్ని దాచుకునే విద్యను అభ్యసించాలని.. మిమ్మల్ని రాయలసీమకు ట్రైనింగ్ కు పంపుతానని చెప్పారు. రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంటుందని పవన్ చెప్పారు. కమ్మవారికి వ్యతిరేకం కాదని చెప్పడానికే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని అన్నారు. ఇప్పుడు టీడీపీ సత్తా సరిపోవడం లేదని అన్నారు

రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి 'ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం' అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ప్రశ్నించే వాడంటే అధికార పక్షానికి భయం పట్టుకుందన్న పవన్.. అందుకే నేనంటే వైసీపీ భయమన్నారు. ప్రశ్నించాలంటూ మొదట్నుంచీ నేను ప్రజలను మొత్తుకునేది అందుకేనన్నారు పవన్. సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు పవన్ కళ్యాణ్.


Next Story