వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోండి.. సైబర్ క్రైమ్ పోలీసులకు న‌టి పవిత్ర లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh Complains on websites and channels to cyber crime. నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

By Medi Samrat  Published on  26 Nov 2022 6:39 PM IST
వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోండి.. సైబర్ క్రైమ్ పోలీసులకు న‌టి పవిత్ర లోకేష్ ఫిర్యాదు
నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్నిరోజుల నుంచి నరేష్, పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి చర్చ నడుస్తోంది. నరేష్- పవిత్ర లోకేష్ ల గురించి యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్ సైట్లు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చడంతో పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ లో ఆమె ఫిర్యాదు చేస్తూ.. కొంతమంది టీవీ ఛానెల్స్, యూట్యూబర్స్ తమను టార్గెట్ గా చేసుకొని అభ్యంతరకర కామెంట్స్ తో పాటు తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్నారని తెలిపింది. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తెలుపుతూ కొన్ని లింక్స్ ను కూడా పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు. సోషల్ మీడియాలో తను, నరేష్‌పై వస్తోన్న వార్తలు, ట్రోల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీలసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.





Next Story