పరేష్ రావల్ చనిపోయాడంటూ పోస్టులు.. లింగం మావయ్య ఏమన్నాడంటే..

Paresh Rawal has a witty response to his death hoax. పరేష్ రావల్.. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు.

By Medi Samrat
Published on : 14 May 2021 2:10 PM

పరేష్ రావల్ చనిపోయాడంటూ పోస్టులు.. లింగం మావయ్య ఏమన్నాడంటే..

పరేష్ రావల్.. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కనిపించి మెప్పించడమే కాకుండా.. ముఖ్యంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ద్వారా తెలుగులో భీభత్సమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే కొందరు వ్యక్తులు పరేష్ రావల్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తూ వచ్చారు. గొప్ప నటుడిని కోల్పోయామని పలువురు ట్వీట్లు కూడా చేశారు.

పరేష్ రావల్ ఈ పోస్టులను సోషల్ మీడియాలో చూశారు. 14-05-2021 ఉదయం 7గంటల సమయంలో పరేష్ రావల్ చనిపోయారు అంటూ ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ ను చూసిన పరేష్ రావల్.. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఉదయం 7 గంటలకు నిద్రపోతూ ఉన్నాను' అంటూ సమాధానం ఇచ్చారు. "Sorry for the misunderstanding as I slept past 7am ...!" అంటూ ఎంతో క్లాసీగా సమాధానం ఇచ్చారు పరేష్ రావల్. పలువురు నెటిజన్లు ఈ రిప్లైను చూసి నవ్వుకుంటూ ఉన్నారు. కావాలనే సెలెబ్రిటీలు చనిపోయారంటూ కొందరు ఎందుకు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారోనని తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో కూడా చాలా మంది సెలెబ్రిటీలు చనిపోకపోయినా కూడా చనిపోయారంటూ పోస్టులు పెట్టడం.. అవి వైరల్ అవ్వడం గమనించే ఉంటాం. తాజాగా కూడా అలాంటిదే పరేష్ రావల్ విషయంలో చోటు చేసుకుంది.


Next Story