'ఆపరేషన్ వాలెంటైన్' రన్‌టైమ్ ఎంతంటే.?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ దక్కింది.

By Medi Samrat  Published on  28 Feb 2024 9:00 PM IST
ఆపరేషన్ వాలెంటైన్ రన్‌టైమ్ ఎంతంటే.?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ దక్కింది. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. మన IAF అధికారుల గొప్పతనాన్ని చూపించే సినిమా ఇదని.. ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన చిత్రమని వరుణ్ తేజ్ చెబుతున్నాడు.

ఆపరేషన్ వాలెంటైన్‌లో వింగ్ కమాండర్ రుద్రగా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. 2 గంటల 4 నిముషాలు సినిమా రన్ టైమ్ ఉండే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ వచ్చిందని ఇప్పటికే ప్రశంసలు దక్కాయి. ఇక సినిమాను చూసి అభిమానులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Next Story