FactCheck : షారుఖ్ ఖాన్ ఓ వ్యక్తిని తోస్తున్న వీడియో డంకీ ప్రమోషన్స్ కు సంబంధించినది కాదు

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం డంకీ ఈ ఏడాది విడుదల కాబోతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2023 9:30 PM IST
FactCheck : షారుఖ్ ఖాన్ ఓ వ్యక్తిని తోస్తున్న వీడియో డంకీ ప్రమోషన్స్ కు సంబంధించినది కాదు

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం డంకీ ఈ ఏడాది విడుదల కాబోతోంది. ఈ సినిమా షారుఖ్ ఖాన్ నుండి ఈ ఏడాది రాబోతున్న మూడో సినిమా. "CIA (కామ్రేడ్ ఇన్ అమెరికా)" అనే మలయాళ సినిమాకి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఊహాగానాల మధ్య షారుఖ్ ఖాన్ గుంపులో ఒక వ్యక్తిని నెట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'డంకీ' సినిమా మలయాళ సినిమాకి రీమేక్ అని గట్టిగా అరిచిన అభిమానిని షారుఖ్ ఖాన్ చెంపదెబ్బ కొట్టాడని వినియోగదారులు చెప్పుకొచ్చారు.


“This is Bizarre !! #SRK was seen slapping a fan when someone from the crowd shouted that #Dunki is a remake of the 2017 Malayalam movie #CIA No matter how famous you get, never play with the emotions of Fans.” అంటూ ఒక ట్విట్టర్ వినియోగదారుడు వీడియోను పోస్టు చేశారు. ఎంత ఫేమస్ అయినా కూడా.. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోకండి అంటూ హెచ్చరించారు.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ ఈ వీడియో 2016 నాటిదని కనుగొంది. ఈ వీడియోకు షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం డంకీకి ఎలాంటి లింక్‌లు లేవని కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా. మేము సెప్టెంబర్ 20, 2016 న Bollywood.com కు సంబంధించిన ఒక నివేదికలో వైరల్ వీడియోకు సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ ఘటన షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ఫోటోలను తీసుకుంటున్నట్లు చూపించింది. నివేదికల ప్రకారం.. ఇంతియాజ్ అలీ చిత్రం కోసం షారుఖ్ ఖాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓ అభిమాని షారుఖ్ ఖాన్ ను తన దగ్గరకు లాక్కోడానికి ప్రయత్నించగా.. షారుఖ్ ఖాన్ దూరంగా అతడిని తోసాడు.


“Fan CRIES After Shahrukh Khan Insults & Pushes Him In Public.” అనే టైటిల్ తో ఓ వీడియోను కూడా అప్లోడ్ చేశారు. సెప్టెంబర్ 19, 2016న మూవీ టాకీస్ అప్లోడ్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.


2016లో అప్‌లోడ్ చేసిన మరో వీడియోను కూడా మేము కనుగొన్నాము. షారుఖ్ ఖాన్ దూరంగా నెట్టివేసిన అభిమాని.. అతని ప్రవర్తనకు షారుఖ్ ఖాన్ కు క్షమాపణలు చెప్పాడు. టర్కీలో షారుఖ్ ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్న అభిమాని అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

కాబట్టి, షారుఖ్ ఖాన్ తన అభిమానిని దూరంగా నెట్టివేస్తున్న వైరల్ వీడియో 2016 నాటిదని స్పష్టంగా తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం "డంకీ"కి తప్పుగా లింక్ చేశారని మేము గుర్తించాం.

Credits : Md Mahfooz Alam

Claim Review:షారుఖ్ ఖాన్ ఓ వ్యక్తిని తోస్తున్న వీడియో డంకీ ప్రమోషన్స్ కు సంబంధించినది కాదు
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:False
Next Story