'ఓజీ' ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆ టైమ్‌కు రెడీగా ఉండండి..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా అభిమానులంతా ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

By -  Medi Samrat
Published on : 18 Sept 2025 4:16 PM IST

ఓజీ ట్రైలర్ వచ్చేస్తోంది.. ఆ టైమ్‌కు రెడీగా ఉండండి..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా అభిమానులంతా ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో, సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి అభిమానుల కోసం బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘డెత్ కోటా.. కన్ఫర్మ్ అంటా’ అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్‌తో అభిమానులు ఎంతో ఆనంద పడుతూ ఉన్నారు.

ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, షాన్ కక్కర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న థియేటర్స్ విడుదల కాబోతుంది.

పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ హోంశాఖ మెమో జారీ చేసింది. ఓజి సినిమా బెనిఫిట్ షో ను 25వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంటకు 1000 రూపాయలు టికెట్ రేట్ తో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్ 125 గాను, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు గాను పెంచుకోవచ్చు. ఈనెల 25వ తారీకు నుండి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయి.

Next Story