బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. వేడుకలకు ముహూర్తం ఖరారు

నందమూరి తారకరామారావు కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు

By Medi Samrat  Published on  31 July 2024 7:15 PM IST
బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్ర‌స్థానం.. వేడుకలకు ముహూర్తం ఖరారు

నందమూరి తారకరామారావు కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బాలయ్య త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 5 దశాబ్దాల కెరీర్‌లో బాలయ్య 108 సినిమాల్లో పనిచేశారు. ఇప్పుడు తన 109వ చిత్రాన్ని ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో 50 ఏళ్ల ఈ జర్నీని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, రాజకీయ వర్గాలకు చెందిన వారు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఇతర సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాతమ్మ కల (1974) సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత కేసరి హ్యాట్రిక్ హిట్‌లతో కెరీర్‌లో గొప్ప దశలో ఉన్నారు. ఆయన తన 109 సినిమా బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Next Story