ఆ అరుపులు వినగానే ఎన్టీఆర్ కు కోపం వచ్చేసింది..!
NTR Serious in Audio Function. అభిమానులు చేసే అతికి ఎంత పెద్ద స్టార్స్ కు అయినా ఆగ్రహం వచ్చేస్తూ ఉంటుంది.
By Medi Samrat
తాజాగా 'తెల్లవారితే గురువారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ రాగానే సీఎం.. సీఎం.. అంటూ అరుపులు వచ్చాయి. దీనిపై కొద్దిసేపు సైలెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతుండగా "సీఎం, సీఎం" అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఎన్టీఆర్ ను కాస్తంత అసహనానికి గురయ్యాడు. వెంటనే ప్రసంగం ఆపి... "ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా" అంటూ మందలించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అవ్వడంతో అభిమానులు కూడా ఆయన మాట విన్నారు. అప్పటి వరకు అరిచిన వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం లోకి రావాలంటే ఎన్టీఆర్ పార్టీ కోసం ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. పలు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు.