'ఆర్‌ఆర్‌ఆర్‌' సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన 'కొమరం భీం' న్యూ లుక్.!

NTR new look released in RRR movie. పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ భారీ

By అంజి  Published on  6 Dec 2021 12:20 PM IST
ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన కొమరం భీం న్యూ లుక్.!

పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా ట్రైలర్‌ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పోస్టర్‌ ద్వారా డిసెంబర్‌ 9న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.. ప్రమోషనల్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమా తెరకెక్కించారని ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లతో తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ సోలో పిక్‌ విడుదల చేస్తూ.. ట్రైలర్‌ మరో మూడు రోజుల్లో ఉంటుందని తెలిపింది. ఇక పోస్టర్‌ను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తపు మరకలతో ఎన్టీఆర్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఆనందాన్ని అందించిందనే చెప్పాలి. డిసెంబర్‌ 3న ట్రైలర్‌ రిలీజ్‌ కావాల్సి ఉండగా.. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో వాయిదా పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌, హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌లతో పలువురు ప్రముఖ నటులు నటించారు. ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Next Story