ఎన్టీఆర్ - కొరటాల సినిమా.. ఇదిగో క్రేజీ అప్‌డేట్..

NTR Koratala Shiva Movie Update. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే.

By Sumanth Varma k  Published on  3 Feb 2023 3:24 PM IST
ఎన్టీఆర్ - కొరటాల సినిమా.. ఇదిగో క్రేజీ అప్‌డేట్..

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. అనౌన్స్ చేసి చాలా రోజుల‌వుతున్నా చిత్రం ఇంకా మొద‌లుకాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకు సంబంధించి ఈ నెలాఖ‌రున పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే వచ్చే నెల మార్చి నుంచి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించి శంషాబాద్ ద‌గ్గ‌ర ఓ చోట సెట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

సినిమా తొలిసగం ఫన్, లవ్, ఫ్యామిలీ జానర్ లు టచ్ చేసి, సెకండాఫ్ మొత్తం మాస్ యాంగిల్‌లో నడుస్తుందని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు బలంగా విన‌బ‌డుతున్నాయి.

Next Story