కొత్త సినిమా కీలక షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్

NTR is getting ready for the key schedule of the new movie. ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కు వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రీసెంట్‌గా ఇండియాకు వచ్చారు

By Medi Samrat
Published on : 5 Jun 2023 3:15 PM IST

కొత్త సినిమా కీలక షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్

ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కు వెళ్లిన జూనియర్‌ ఎన్టీఆర్‌ రీసెంట్‌గా ఇండియాకు వచ్చారు. కొత్త సినిమా దేవర షెడ్యూల్‌ కోసం ఎన్టీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు దఫాలుగా చిత్రీకరణ జరుపుకుంది. సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లను చాలా మట్టుకు తెరకెక్కించారు. ఈ వారంలో దేవర కొత్త షెడ్యూల్‌ మొదలు కాబోతున్నది. ఈ షెడ్యూల్‌లో విలన్‌ సైఫ్‌ అలీఖాన్‌, ఎన్టీఆర్‌, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. సినిమాలో ఇదే ముఖ్యమైన భాగమని మేకర్స్‌ చెబుతున్నారు. అందుకే దర్శకుడు కొరటాల శివ పక్కాగా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఎలాగైనా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణతో పాటుగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా జరుపుతున్నారు.


Next Story