ఎన్టీఆర్‌ కోసం ఇటలీ నుంచి రానున్న కొత్త కారు.. స్పెషాలిటీ ఏంటో..

NTR importing a new car from Italy.హీరో ఎన్టీఆర్‌ ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే కారును ఇటలీ నుంచి బుక్‌ చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

By Medi Samrat  Published on  3 March 2021 4:30 AM GMT
NTR importing a new car from Italy

ఖరీదైన కార్లను కొనడం అనేది సెలబ్రిటీలకు ఒక హాబీగా ఉంటుంది. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు, క్రికెటర్లు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. వారి ఇష్టాన్ని మొత్తం వాహనాలపైనే పెడతారు. ఇక హీరో ఎన్టీఆర్‌ ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే కారును బుక్‌ చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆ కారు మన ఇండియాలో తయారైనది కాదు.. ఇటలీలో. ఎన్టీఆర్‌ కోసం ఈ కారు ఇటలీ నుంచి ప్రత్యేకంగా భారత్‌కు రానుంది. లాంబోర్గిని కంపెనీకి చెందిన 'ఉరుస్‌' కారును ఎన్టీఆర్‌ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు ఇటలీ నుంచి మరి కొన్ని రోజుల్లో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా లాంబోర్గిని కారుకు ఎంతో క్రేజ్‌ ఉంది. అత్యంత ఖరీదైన, లగ్జరీ కార్ల వరుసలో ఈ లాంబోర్గి మొదటి వరుసలో ఉంటుంది. ఇదిలా ఉండగా, సౌత్‌ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఈ కారును బుక్‌ చేసుకున్న తొలి నటుడు ఎన్టీఆర్‌. ఇక ఈ కారులో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయట. ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో ఉండే ఈ కారు 650 CV ప్రొడ్యుస్‌ చేస్తుంది. కేవలం 3.6 సెకండ్లలో 62 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారుకున్న స్పెషాలిటీ. ఇక ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ విషయానికొస్తే.. జూనియర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి ఓ సినిమా చేయనున్నాడు.


Next Story