ఎన్టీఆర్ కు హారతి ఇచ్చిన సునిశిత్‌

NTR fans gives different punishment to Sacrificing star Sunisith. సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ నోటికొచ్చినట్లు వాగుతూ పాపులారిటీని సంపాదించుకోవాలని

By M.S.R  Published on  29 May 2023 5:35 PM IST
ఎన్టీఆర్ కు హారతి ఇచ్చిన సునిశిత్‌

సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ నోటికొచ్చినట్లు వాగుతూ పాపులారిటీని సంపాదించుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే అతడు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి అసలు లేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ పై కామెంట్లు చేసి దెబ్బలు తిన్నాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. కొద్దిరోజుల కిందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు.. రామ్ చరణ్, ఉపాసనలను ఉద్దేశించి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుగా మాట్లాడటంతో సునిశిత్‌ను చితకబాదారు. ఇంకెప్పుడూ రామ్ చరణ్, ఉపాసన‌తో పాటు సినిమా పరిశ్రమలో ఏ ఒక్కరిపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్‌పై సునిశిత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన ఎంత పెద్ద హీరో అయినా గతంలో కొన్ని పోర్న్ సినిమాల్లో నటించారని చెప్పాడు. ఈ విషయం తనకు మాత్రమే తెలుసని.. ఎన్టీఆర్ పోర్న్ సినిమాల్లో నటించాడనే నిజాన్ని బయటికి చెప్పే ధైర్యం తనకు తప్ప ఇండస్ట్రీలో ఎవ్వడికీ లేదని అన్నాడు. దీంతో సునిశిత్‌ కు ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుద్ధి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటాన్ని తీసుకొచ్చి.. దానికి సునిశిత్‌తో హారతి ఇప్పించారు. కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి హారతి ఇచ్చిన సునిశిత్.. ఆ తరవాత దిష్టితీసిన ఆ కొబ్బరికాయను నేలకేసి కొట్టారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.



Next Story