'త‌గ్గేదేలే'.. అల్లు అర్జున్, రష్మికల‌ను వాడేసిన అమూల్

Now, Pushpa-inspired Amul Ad. అమూల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు వారి ప్రొడ‌క్టుల మాదిరిగానే తాజా తాజా విష‌యాల‌ను

By Medi Samrat  Published on  17 Jan 2022 12:54 PM IST
త‌గ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మికల‌ను వాడేసిన అమూల్

అమూల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు వారి ప్రొడ‌క్టుల మాదిరిగానే తాజా తాజా విష‌యాల‌ను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా అల్లు అర్జున్, రష్మిక మందన్నల కొత్త చిత్రం "పుష్ప" విజయాన్ని ప్ర‌స్తావిస్తూ ఓ పోస్టు చేసింది. ఈ కొత్త యాడ్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్నలు వెన్నతో బ్రెడ్ స్లైస్‌లను ఆస్వాదిస్తున్నారు. అల్లు అర్జున్ ట్రేడ్‌మార్క్ పుష్ప రాజ్ స్టైల్‌లో ఒక రాతిపై కూర్చుని బ్రెడ్ స్లైస్‌లపై వెన్నను పూస్తున్నట్లు కనిపించారు. 'సామీ సామి' డ్యాన్స్ పోజ్‌లో కనిపించిన రష్మిక చేతిలో బ్రెడ్ స్లైస్‌లు, వెన్న స్ప్రెడ్‌తో ఉన్నాయి. "పుష్‌ప్యాక్ ది స్లైస్" & "హావ్ కొంచం అముల్లు, అర్జున్!" అనే అందమైన ట్యాగ్‌లైన్‌లతో.. పోస్టు చేసిన‌ చమత్కారమైన పోస్టర్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

సినిమా, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన అంశాలపై అమూల్ డైరీ బ్రాండ్.. కామిక్‌ వన్-లైనర్లు చాలా సంవత్సరాలుగా జ‌నాల‌ను అలరిస్తున్నాయి. వారి క్రియేటివ్‌ వాణిజ్య ప్రకటనలు చాలా ఆకర్షణీయంగా, ఆనందదాయకంగా ఉంటాయి. ప్ర‌స్తుత ట్రెండింగ్ విష‌యాల‌ను వాడుతూ.. బ్రాండ్ తన ఉత్పత్తులను చాలా తెలివిగా ప్రమోట్ చేస్తుంది. తాజాగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న పుష్ప సినిమాను వాడి.. వాడ‌కంలో 'త‌గ్గేదేలే' అని మ‌రోమారు త‌న మార్కును చూపించింది. అమూల్ షేర్ చేసిన ఫోటో ద్వారా ఆ చిత్రానికి, అందులోని పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చింది.

"పుష్ప" చిత్ర నిర్మాతలు ప్రకటనను చూసి ఆనందం వ్య‌క్తం చేశారు. అమూల్ పోస్టర్‌పై స్పందిస్తూ, "ది టేస్ట్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఆఫ్ ఇండియాను గుర్తిస్తుంది అని రాసుకొచ్చింది. అమూల్ కొత్త ప్రకటనలో #PushpaTheRise" ప్రధాన పాత్రలను గూర్చి ప్ర‌స్తావించింద‌ని తెలిపింది.


Next Story