జాంబీ రెడ్డి సినిమా పై స్పందించిన నిహారిక

Niharika responds on Zombie Reddy movie. జాంబీ రెడ్డి సినిమా ఫిబ్రవరి 5న విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.సినిమాపై మెగా డాటర్ నిహారిక స్పందిస్తూ… 'తాజాగా 'జాంబీ రెడ్డి' మూవీ చూసాను.

By Medi Samrat
Published on : 9 Feb 2021 9:00 PM IST

Niharika responds on Zombie Reddy movie.

జాంబీ రెడ్డి సినిమా ఫిబ్రవరి 5న విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ద్వారా "రాజకుమారుడు", "యువరాజు", "చూడాలని వుంది", "ఇంద్ర" సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేకక్షకులని ఆకట్టుకున్న తేజ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.హీరోగా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. నిజానికి తేజ ఈ సినిమాకి ముందే సమంత - నందినీ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 'ఓ బేబీ' సినిమాలో కూడా నటించాడు. కానీ హీరోగా మాత్రం అతనికి ఇదే మొదటి చిత్రం.

ఇక మంచి సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై మెగా డాటర్ నిహారిక స్పందిస్తూ… 'తాజాగా 'జాంబీ రెడ్డి' మూవీ చూసాను. తెలుగులో ఇదే మొదటి 'జాంబీ' చిత్రం. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ చిత్రంలో కామెడీతో బాగా నవ్వించాడు. 'ప్రశాంత్ వర్మ.. నీ డైరెక్షన్ బాగుంది. తేజ నీ యాక్టింగ్ సూపర్.

నీ నటనలో 20 ఏళ్ల అనుభవం కనిపించింది. ఈ సినిమాలో దక్ష, ఆనంది, హేమంత్, గెటప్ శ్రీను అందరు బాగా నటించారు. మార్క్స్ అందించిన నేపధ్య సంగీతంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. మేకప్‌తో పాటు అన్ని డిపార్టెమెంట్స్ పనితనం బాగుంది. 'జాంబీ రెడ్డి' టీమ్‌ అందరికీ నా తరుపున కంగ్రాట్యులేషన్స్' అంటూ చెప్పుకొచ్చింది.ఇక నిహారిక ఈ మధ్యనే పెళ్లి చేసుకోని తన వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.


Next Story