నిహారికను చూసి బోరున ఏడ్చేసిన తల్లి.. అసలేం జరిగిందంటే..?
Niharika Mother About Wedding. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో నిహారిక చైతన్యల వివాహం
By Medi Samrat Published on 13 Dec 2020 2:57 PM ISTరాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో నిహారిక చైతన్యల వివాహం ఈ నెల 9వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. 11వ తేదీన హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ జరగగా కొత్త దంపతులు నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో స్వామివారిని దర్శించుకున్నారు. అయితే నిహారిక చైతన్యల వివాహం గురించి మాట్లాడుతూ నిహారిక తల్లి పద్మజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆలోచనల్లోను, అభిరుచుల్లోను నిహారిక చైతన్యలు ఒకే విధంగా ఉంటారని.. కూతురుకు పెళ్లైందన్న విషయాన్ని ఇప్పటికి కూడా తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు. కూతురు వివాహాన్ని ఘనంగా జరపాలని అనుకున్నానని అనుకున్న విధంగా చాలా గ్రాండ్ గా పెళ్లి వేడుక జరిగిందని చెప్పారు. పెళ్లి తరువాత గతంలో ఎప్పుడూ లేనంత సంతోషంతో కూతురు నిహారిక ఉందని పద్మజ అన్నారు. నిహారిక పెళ్లికి మూడు రోజుల ముందు తనకు జ్వరం వచ్చిందని జ్వరం వల్ల పెళ్లిలో సరిగ్గా పనులు చేయలేకపోయానని అన్నారు.
నిహారిక చైతన్యల వివాహ వేడుకను చూస్తే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనే మాట నిజమేనని అనిపిస్తుందని.. నిహారికకు చైతన్య లాంటి ఆదర్శవంతమైన భాగస్వామి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. నిహారిక పెళ్లి సమయంలో తన నిశ్చితార్థపు చీర కట్టుకుందని ఆ సమయంలో తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని ఆమె అన్నారు. ఆ సమయంలో తను, భర్త నాగబాబు కన్నీళ్లు పెట్టుకున్నామని ఆమె వెల్లడించారు.
నిహారికను తన చీరలో చూడటం లైఫ్ లో అపురూపమైన క్షణం అని.. ఆ సమయం భావోద్వేగపూరితమైన క్షణం అని ఆమె అన్నారు. ఇక నిహారిక చైతన్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిహారిక చైతన్యల జంట మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.