ప్రేమ సందేశం పంపిన చైతన్య... కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక..!
Niharika Konidela & Chaitanya JV's wedding video. చైతన్య పంపిన ప్రేమ సందేశం చూసి కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.
By Medi Samrat Published on 25 Jan 2021 3:20 PM ISTఆ వీడియోలో ఏముందంటే... పెళ్లి వేడుక ప్రారంభమైన రోజు నుంచి ఎంతో ఆనందంగా గడిపిన నిహారిక పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చైతన్య ఓ ప్రేమ సందేశం పంపాడు. అది చదివిన నిహారిక భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చైతన్య పంపిన సందేశం ఏమిటంటే..."ప్రియమైన నిహా! వివాహ బంధంతో మనం మనం ప్రారంభిస్తున్న కొత్త ప్రయాణంలో నీతో ఒక విషయం పంచుకోవాలని ఉంది.
వివాహం తర్వాత నీతో గడిపిన ప్రతి ఒక్క క్షణాన్ని నా తుది శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటా.. ఈ 30 ఏళ్లలో నేను ఏం కోల్పోయానో అది నిన్ను కలిసిన తర్వాత అర్థమయింది. అలాగే నువ్వు నా కోసమే పుట్టావని ...నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది". అంటూ చైతన్య పంపిన ఈ సందేశం చదివిన నిహారిక ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందేశం చదివిన నిహారిక కళ్యాణ తిలకం పెట్టే సమయంలో మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితను హత్తుకొని ఉద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా తన పెళ్లిలో మెగాస్టార్, పవర్ స్టార్ కలసి సరదాగా మాట్లాడుకోవడం, వంటి ఎన్నో మధురమైన క్షణాలను నిహారిక ఈ వీడియోలో పొందుపరిచారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మెగా అభిమానులను ఆకట్టుకుంది.