Niharika husband Chaitanya Given Clarity on Apartment issues. అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ
By Medi Samrat Published on 5 Aug 2021 1:07 PM GMT
అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ ఇచ్చారు. ముందుగా పోలీసు స్టేషన్‌లో నేనే ఫిర్యాదు చేశానని.. మీడియాలో నా పై మొదట కేసు నమోదైనట్లు వస్తుందని అన్నారు. 25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. నేను అపార్ట్‌మెంట్ రెంటుకు తీసుకున్న పర్పస్ మా ఓనర్ కు తెలియజేశానని.. ఆ విషయంలో అపార్ట్‌మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడం కారణంగానే గొడవ జరిగిందని.. గొడవపై ఇరువురు మాట్లాడుకుని చర్చించుకున్నామని అన్నారు. తాము కమర్షియల్ ఆఫీసుగా వాడుకోవడం మిగతా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందని చెప్పారని.. అందుకే తాము ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చైతన్య వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. నిహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ.. గుంపులు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని.. దాని వల్ల తాము ఇబ్బందులకు పడుతున్నామని అపార్ట్‌మెంట్ వాసులు బుధవారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. తమ వ్యక్తి గత జీవితానికి అపార్ట్‌మెంట్ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. విచారణ చేపట్టారు.