అధికారికంగా విడిపోయిన నిహారిక, చైతన్య జొన్నలగడ్డ

Niharika and Chaitanya Jonnalagadda officially broke up. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు.

By Medi Samrat  Published on  4 July 2023 8:25 PM IST
అధికారికంగా విడిపోయిన నిహారిక, చైతన్య జొన్నలగడ్డ

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల- జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పరం విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్‌ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలన్నింటినీ కొద్దిరోజుల కిందట డిలీట్ చేశాడు. నిహారిక కూడా చైతన్య ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఈవెంట్లు, ఫంక్షన్లకు నిహారిక సింగిల్‌గా రావడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా నిహారిక- చైతన్య దంపతులు అధికారికంగా విడిపోయారు.


జులై 4వ తేదీన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక విడాకుల దరఖాస్తు బయటకు రావటం సంచలనంగా మారింది. ఆ దరఖాస్తుతో వీళ్లిద్దరూ త్వరలోనే అధికారికంగా వేరు కానున్నారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నిహారిక కోర్టుకెళ్లారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక దరఖాస్తు చేసుకున్నారు. హిందూ చట్ట ప్రకారం విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 2020లో చైతన్యతో నిహారిక వివాహం జరగగా.. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.


Next Story