పెళ్లి మండపంలో పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఘన నివాళి..!

Newly married couple pay tribute to actor Puneeth Rajkumar. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్తతో

By అంజి  Published on  1 Nov 2021 4:54 AM GMT
పెళ్లి మండపంలో పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఘన నివాళి..!

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్తతో ఎంతో మంది అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఓ కొత్త పెళ్లి జంట.. పునీత్‌పై ఉన్న అభిమానంతో పెళ్లి మంటపంలోనే శ్రద్ధాంజలి ఘటించారు. వివరాల్లోకి వెళ్తే.. మను కిరణ్‌, లావణ్య అనే నూతన వధూవరుల పెళ్లి మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో జరిగింది. పెళ్లి వేడుక జరిగిన తర్వాత.. అక్కడ పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఫొటోను ఏర్పాటు చేసి కొవ్వొత్తులు వెలిగించి పూలు వేసి నివాళులు అర్పించారు.

పెళ్లికి వచ్చిన వారు కొత్త పెళ్లి జంటను ఆశీర్వదించడంతో పాటు పునీత్‌ రాజ్‌కుమార్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ఇక పెళ్లిన వచ్చిన వారిలో ఎక్కువగా పునీత్‌ ఇకలేడనే బాధే వ్యక్తమైంది. పునీత్‌ మరణం మొత్తం దక్షిణాది సినిమా ఇండస్ట్రీనే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు టాలీవుడ్‌ నటీనటులు పునీత్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. కర్ణాటకలోని పునీత్‌ అభిమానులు కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అభిమాని అశోక్‌ (40) పునీత్‌ మరణాన్ని జీర్ణించుకోలేక కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మైసూరు డిస్ట్రిక్‌లోని కేఆర్‌ నగరలో జరిగింది.

Next Story
Share it