జంటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు వీళ్లే!

New Year Wishes From Celebrity Couples. 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు జంటగా తెలియజేసిని టాలీవుడ్ సెలబ్రిటీలు.

By Medi Samrat  Published on  2 Jan 2021 9:18 AM IST
celebrity couples

2020 సంవత్సరం మొత్తం కరోనా వైరస్ భయభ్రాంతులతోనే ముగిసింది.ఈ విధంగా 2020 వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ, కొత్త ఆశలతో మన జీవితంలో మంచి విజయాలు అందుకోవాలని అందరూ ఎంతో ఉత్సాహంగా 2021 వ సంవత్సరానికి స్వాగతం పలికారు. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖ సెలబ్రిటీస్ వరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీస్ జంటగా చేసిన పోస్టులు తమ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సినీ సెలబ్రిటీస్ చేసిన పోస్టులు వాటికి ఇచ్చిన క్యాప్షన్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

సమంత:

నూతన సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేయడానికి తన భర్త నాగచైతన్యతో కలిసి గోవా వెళ్లిన సమంత నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని పోస్ట్ చేశారు.



కాజల్ అగర్వాల్:

2 నెలల క్రితం తన స్నేహితుడు గౌతమ్ ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం సిమ్లా వెళ్లారు. సిమ్లా లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్న ఈ జంట ఈ సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం ఉండాలని ఆకాంక్షించారు.



సోనమ్ కపూర్:

నా లైఫ్ పార్టనర్ తో ఈ ఏడాది మొత్తం సంతోషంగా గడపడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అందరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలు, సంతోషం నిండి ఉండాలని కోరుకుంటున్నట్లు సోనమ్ కపూర్ తెలిపారు.



నమ్రత:

2020 సంవత్సరం మనకు ఎన్నో పద్ధతులు, జాగ్రత్తలను నేర్పిందని, రాబోయే సంవత్సరంలో అంతా మంచి జరుగుతుందని అందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు నమ్రత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.



అల్లు స్నేహ:

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.



విగ్నేష్:

మన జీవితంలో మర్చిపోలేని ఒక కీలకమైన ఘట్టాన్ని దాటామని, ఇకనుంచి అంతా మంచి జరగాలని కోరుకుంటూ 2021 లోకి అడుగులు వేద్దాం. ఈ సంవత్సరంలో అందరి జీవితంలో ఎంతో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.




Next Story