మాధవన్‌పై నెటిజన్ల ట్రోలింగ్

Netizens brutally troll R Madhavan for his remark. ప్రముఖ నటుడు మాధవన్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం

By Medi Samrat  Published on  25 Jun 2022 4:00 PM GMT
మాధవన్‌పై నెటిజన్ల ట్రోలింగ్

ప్రముఖ నటుడు మాధవన్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' (Rocketry: The Nambi Effect) ప్రమోషన్ కార్యక్రమాలలో భారత అంతరిక్ష పరిశోధన రంగంపై మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడిందని మాధవన్ పేర్కొన్నారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగిందని అన్నారు. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

సైన్స్ పరమైన విషయాలు మాట్లాడేటప్పుడు నోరు జారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాధవన్‌కు ఇప్పుడు అర్థమై ఉంటుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. సైన్స్ గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ, ఏవి ఎలా పనిచేస్తాయో తెలియనప్పుడు నోరు విప్పకపోవడం మంచిదని ఓ యూజర్ మాధవన్‌కు సలహా ఇస్తున్నారు. మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమా జులై 1న విడుదల కాబోతోంది. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


Next Story
Share it