అప్పుడు మహేష్ బాబు ఫైట్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫైట్.. అదరగొట్టేశారు

Nellore Kids Make Vakeel Saab Spoof. నెల్లూరు కుర్రాళ్ళు తమదైన మార్కు వకీల్‌సాబ్‌ స్పూఫ్ ఫైట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  24 May 2021 1:10 PM GMT
Vakeel saab spoof

ఒకప్పుడు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా ఇంటర్వెల్ సీన్ ను అద్భుతంగా స్పూఫ్ చేసిన కుర్రాళ్ళు గుర్తున్నారు కదా..! ఇప్పుడు మరో ఫైట్ సీన్ తో ముందుకు వచ్చారు. అప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను వాడుకోగా.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను వాడుకున్నారు. వకీల్ సాబ్ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తూ ఉండగా.. ఈ సారి నెల్లూరు కుర్రాళ్ళు తమదైన మార్కు స్పూఫ్ ఫైట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు.

'వకీల్‌సాబ్‌' సినిమాలోని ఓ ఫైట్‌ ను రీక్రియేట్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు ఈ వీడియో రూపొందించారు. సినిమాలో చూపించిన దానికి ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్ సీన్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా షూట్ చేశారు. ముఖ్యంగా కెమెరా పనితనం.. స్టంట్స్ చాలా అద్భుతంగా కుదిరాయి. పవర్‌స్టార్‌ అభిమానులు, సంగీత దర్శకుడు తమన్​ అందరూ సూపర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే కొన్ని స్టంట్స్ కాస్త డేంజర్ గానే ఉన్నాయి. సైకిల్ మీద పడడం.. డోర్ ను గుద్దడం కాస్త రిస్కీ గానే కనిపిస్తున్నాయి. పిల్లోళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పలువురు హెచ్చరిస్తూ ఉన్నారు కూడా..!Next Story