NBK at Banglore to pay his last respects to Puneeth Rajkumar. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడంతో శాండల్ వుడ్
By Medi Samrat Published on 30 Oct 2021 7:25 AM GMT
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడంతో శాండల్ వుడ్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయింది. పునీత్ మరణం పట్ల ఫ్యాన్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల ఇండస్ట్రీల నుండి పలువురు ప్రముఖులు బెంగుళూరు కంఠీరవ స్టేడియంకు చేరుకుని భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు. ఇక పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని చివరి చూపు చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు తరలివచ్చారు.
పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి నందమూరి బాలకృష్ణ శ్రద్దాంజలి ఘటించారు. పునీత్ తో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్ కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. మరో హీరో రానా సైతం బెంగుళూరు వెళ్లి పునీత్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మాజీ సిఎం సిద్దరామయ్య, ప్రభుదేవా కూడా కంఠీరవ స్టేడియంకు వెళ్లి శ్రధ్ధాంజలి ఘటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు అక్కడికి చేరుకోనున్నారు. ఇదిలావుంటే.. ఇవాళ సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం 5.00 గంటలకు పునీత్ కుమార్తె బెంగుళూరుకు చేరుకోనుంది. ఆమె ఇక్కడికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారు.