ఎన్నో రోజులకు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది..!
Nazriya Nazim to make her Telugu debut. నజ్రియా నజీమ్.. కొన్ని మలయాళ సినిమాలలో నటించింది. అట్లీ దర్శకత్వం వహించిన
By Medi Samrat Published on 13 Nov 2020 5:59 PM IST
నజ్రియా నజీమ్.. కొన్ని మలయాళ సినిమాలలో నటించింది. అట్లీ దర్శకత్వం వహించిన రాజా-రాణి సినిమా ద్వారా తెలుగు వాళ్లకు కూడా పరిచయమే..! ఆమె ఫహాద్ ను పెళ్లి చేసుకుని కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే ట్రాన్స్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవాలని నజ్రియా భావిస్తోంది. అందులో భాగంగానే నానితో సినిమాకు ఓకే చెప్పేసింది.
నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ నవంబర్ 21న వస్తుందని, ఆలోగా దీపావళి గిఫ్ట్‌గా మూవీని ప్రకటించామని తెలిపింది. పోస్టర్‌లో వీణ, ఫ్లైట్, కెమెరా ఇలా పలు వస్తువులు ఉండగా.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
లవ్ ఇష్క్ కాదల్ మూవీకి కథను అందించిన వివేక్ ఆత్రేయ.. మెంటల్ మదిలో చిత్రంతో దర్శకుడిగా రంగప్రవేశం చేశాడు. ఆ తరువాత బ్రోచేవారెవరురా సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తున్నాడు నాని.. ఆ తరువాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్‌లో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక వివేక్ ఆత్రేయ సినిమాలో నటించనున్నాడు. నాని నటిస్తున్న 28వ సినిమాకు మంచి కాంబినేషన్ సెట్ అవుతోందన్నమాట..!