మా ఆయన బాగానే ఉన్నాడు : హీరోయిన్
Nazriya Nazim shares the health status of Fahadh Faasil. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ 'మలయన్ కుంజు' అనే సినిమాలో నటిస్తున్నారు
By Medi Samrat
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా లేని పోని విషయాలన్నీ టాం టాం చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు అయితే సెకన్లలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ 'మలయన్ కుంజు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇటీవలే ఫాహద్ ముక్కుకు గాయం కాగా, వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు.. ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. దాంతో సోషల్ మీడియాలో ఫాహద్ అనారోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయన కొంత కాలం బయటకు రాలేకపోవొచ్చు అని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.
తాజాగా దీనిపై స్పందించిన ఆయన సతీమణి.. నటి నజ్రియా అతడి ఆరోగ్యం గురించి అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరంలేదని పేర్కొంది. ఫాహద్ ఫాసిల్ బెడ్ పై పడుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఫాహద్ ముక్కుకు బలంగా గాయం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఆయనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు అతడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక నాని హీరోగా వస్తున్న 'అంటే సుందరానికీ' చిత్రం ద్వారా బ్యూటీ డాళ్ నజ్రియా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఫాహద్ ఫాసిల్ 2014లో నజ్రియాను పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఫహద్ కోలుకున్న వార్త విని పలువురు ప్రముఖులు సంతోషించారు. నటుడు దుల్కర్ సల్మాన్, నవీన్ నిజాం, సౌబిన్ షాహిర్, అన్నా బెన్ త్వరగా కోలుకోవాలని మెసేజ్ పంపుతూ ఆకాక్షించారు. అతను ప్రస్తుతం థాంకం, మలయన్కుంజు, దిలీష్ పోథన్ యొక్క జోజి వంటి ఐదు ప్రాజెక్టులలో కలిసి పని చేస్తున్నాడు. పట్టు, పాచువుమ్ అల్బుతా విలక్కం వంటి సినిమాల్లో కూడా చేస్తున్నాడు.