అందాల భామ నయనతార.. కొత్త బిజినెస్

Nayanthara Launches Her New Business. అందాల భామ నయనతార.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తోంది. తాజాగా ఈ లేడీ సూపర్‌ స్టార్‌ బ్యూటీ నయనతార మరో కొత్త వ్యాపారం ప్రారంభించింది.

By అంజి
Published on : 11 Dec 2021 3:58 PM IST

అందాల భామ నయనతార.. కొత్త బిజినెస్

అందాల భామ నయనతార.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తోంది. తాజాగా ఈ లేడీ సూపర్‌ స్టార్‌ బ్యూటీ నయనతార మరో కొత్త వ్యాపారం ప్రారంభించింది. 'ది లిప్‌బామ్‌ కంపెనీ' అనే బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌తో కలిసి నయనతార ప్రారంభించింది. కంపెనీ లాంచ్ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. స్కిన్‌కేర్ ఉత్పత్తుల విషయంలో నేను రాజీలేని వైఖరిని నమ్ముతాను. తన కంపెనీ తయారుచేసిన బ్యూటీ ఉత్పత్తుల చూసి గర్వపడుతున్నానని. ఇది ప్రజల అంచనాలకు సమానంగా ఉంటుందని ఆమె పేర్కొంది. నయనతార 'కాతు వాకుల రెండు కాదల్', 'గోల్డ్', 'కనెక్ట్', 'గాడ్ ఫాదర్' అనే సినిమాల్లో నటిస్తోంది.

చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌ మాట్లాడుతూ.. మా ద్దరికీ 10 ఏళ్ల పరిచయం ఉంది. నయనతారపై తనకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగస్వామిని అయ్యానని చెప్పారు. ఈ బ్యూటీ రిటైల్‌ బ్రాండ్‌కు సంబంధించి గత రోజులుగా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని, కొవిడ్‌ కారణంగా ఇది మరింత ఆలస్యమైందన్నారు. అయితే ఎట్టకేలకు 'ది లిప్‌బామ్‌ కంపెనీ' బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం' అని రాజన్‌ చెప్పారు.

Next Story