జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగులో ఆ రెండు చిత్రాలకు..

National film awards presentation in Delhi. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం సోమవారం నాడు అట్టహాసంగా

By అంజి  Published on  25 Oct 2021 8:31 AM GMT
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగులో ఆ రెండు చిత్రాలకు..

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం కార్యక్రమం సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. భారతీయ సినిమాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, ప్రేక్షుల ఆదరణ పొందిన సినిమాలకు భారత వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకయ్యనాయుడు అవార్డులు అందజేశారు. తెలుగులో 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

ఇక బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌గా మలయాళం నుంచి 'మరక్కర్‌' నిలిచింది. 'మణికర్ణిక' సినిమాకు కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా, 'అసురన్‌' సినిమాకు ధనుష్‌, 'భోంస్లే' సినిమాకు మనోజ్‌బాజ్‌పాయి ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'దాదాసాహెబ్‌ ఫాల్కే' అవార్డు అగ్రహీరో, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు లభించింది. గత 40 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీ కోసం రజనీ చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం.. ఈ విశిష్ట పురస్కారంతో గౌరవించింది. ఒకే సంవత్సరంలో రజనీ, తన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తమ దర్శకుడిగా సంజయ్‌ పూర్‌ సింగ్‌ చౌహాన్‌ అవార్డు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' అవార్డు లభించగా.. ఉత్తమ ఎడిటింగ్‌లో 'జెర్సీ' మూవీ నుండి నవీన్‌ నూలి అవార్డు వచ్చింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'మహర్షి'కి అవార్డు వచ్చింది. ఉత్తమ సహాయ నటుడి 'సూపర్‌ డీలాక్స్‌' మూవీ నుండి విజయ్ సేతుపతి అవార్డు అందుకున్నారు.

Next Story