ఒక్క రోజునే 60 లక్షల టికెట్లు సేల్

ప్రతీ ఏడాది లాగే మల్టీప్లెక్స్ ఆసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా అక్టోబర్‌ 13న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహించింది.

By Medi Samrat  Published on  14 Oct 2023 4:30 PM IST
ఒక్క రోజునే 60 లక్షల టికెట్లు సేల్

ప్రతీ ఏడాది లాగే మల్టీప్లెక్స్ ఆసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా అక్టోబర్‌ 13న ‘జాతీయ సినిమా దినోత్సవం’ నిర్వహించింది. జాతీయ సినిమా దినోత్సవం సంద‌ర్భంగా కేవ‌లం రూ.99కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవ‌కాశం క‌ల్పించింది. అక్టోబర్‌ 13న దేశ‌వ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లలో కేవ‌లం రూ.99ల‌కే సినిమా చూసే అవకాశాన్ని ప్రకటించగా.. ఈ ఒక్క రోజే దాదాపుగా 6 మిలియన్స్‌కు పైగా ఆడియెన్స్‌ మల్లీప్లెక్స్‌లలో సినిమాలు చూశారు. ఈ విష‌యాన్ని మల్టీప్లెక్స్ ఆసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది.

గతేడాది నేషనల్ సినిమా డే రోజున కేవలం రూ.75లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే చాన్స్‌ కల్పించారు. కాగా ఆ ఒక్క రోజే దాదాపుగా 6.5 మిలియన్స్‌కు పైగా ఆడియెన్స్‌ మల్లీప్లెక్స్‌లలో సినిమాలు చూశారు. ఈ ఏడాది రూ.99లకు సినిమా చూసే అవకాశం కల్పించారు.

Next Story