సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నరేష్
Naresh About Sai Dharam Tej Accident. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 11 Sept 2021 2:58 PM ISTసాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతూ వస్తున్నారు. మీడియాతో కూడా చాలా విషయాలను చెబుతూ వస్తున్నారు. సీనియర్ హీరో నరేష్ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
సాయితేజ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని నరేష్ చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్, మా అబ్బాయి ఇద్దరూ మంచి స్నేహితులని కూడా తెలిపారు.నిన్న సాయంత్రం వీళ్లిద్దరూ మా ఇంటి నుంచే వెళ్లారు. వాళ్ల బైక్స్ సౌండ్ విని, వేగంగా వెళ్లొద్దని చెబుదామని బయటకు వచ్చాను. అంతలోనే ఇద్దరూ వెళ్లిపోయారని నరేష్ తెలిపారు. బైకులు వేగంగా నడపొద్దని నాలుగు రోజుల క్రితం వీళ్లకి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను కూడానని తెలిపారు. ఇద్దరూ పెళ్లి కావలసిన వాళ్లని.. మంచి వయస్సులో వున్న వాళ్లని చెప్పుకొచ్చారు. గతంలో ఒకసారి నేను కూడా బైక్ ప్రమాదానికి గురైతే, మా అమ్మ నా చేత ఒట్టు వేయించుకుని, బైక్ నడపడం మానిపించారని తెలిపారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని వున్నా, అక్కడి పరిస్థితులను బట్టి వెళ్లలేకపోతున్నానని అన్నారు. త్వరలోనే వెళ్లి కలుస్తానని తెలిపారు నరేష్. సాయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు నరేశ్.
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తలకు బలమైన గాయాలు లేవని, వెన్నుపూసకు ఎలాంటి దెబ్బ తగల్లేదని వెల్లడించారు. అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తామని తెలిపారు.