'నారప్ప‌'గా దుమ్మురేపిన‌ విక్టరీ వెంకటేశ్... టీజ‌ర్ విడుద‌ల‌

Narappa Teaser Release. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'‌. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా

By Medi Samrat  Published on  13 Dec 2020 12:07 PM IST
నారప్ప‌గా దుమ్మురేపిన‌ విక్టరీ వెంకటేశ్... టీజ‌ర్ విడుద‌ల‌

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప'‌. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నార‌ప్ప మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నారప్ప గెటప్ లో ఉన్న వెంకటేష్ చేతిలో కత్తి పట్టుకొని ఓ చెట్టుచాటు నుంచి ఆవేశంగా నడుస్తూ వస్తుంటాడు. ఆ తర్వాత కత్తితో ప్రత్యర్థులను నరికి తనదైన శైలిలో ఆకాశంలోకి చూసి పెద్దగా అరవడంతో ఈ టీజర్ పూర్తయ్యింది.

డైలాగులు లేకుండా కేవలం మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే చూపించారు. నారప్ప లుక్ లో వెంకీ పరకాయ ప్రవేశం చేసినట్లు అర్థం అవుతోంది. ఇందులో వెంకటేశ్ అద్భుతంగా కనిపిస్తున్నాడని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం గమనార్హం.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'అసురన్' కి రీమేక్ గా 'నారప్ప' సినిమా తెరకెక్కుతోంది.ఇక నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది.





Next Story