మరో సినిమాను కంప్లీట్ చేసేసిన నాని.. ఈసారి థియేటర్ లోనా, ఓటీటీలోనా..?

Nani-starrer ‘Ante Sundaraniki’ shoot wrapped up. హీరో నాని అంటేనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడనే టాక్ నడుస్

By Medi Samrat  Published on  24 Jan 2022 8:43 AM GMT
మరో సినిమాను కంప్లీట్ చేసేసిన నాని.. ఈసారి థియేటర్ లోనా, ఓటీటీలోనా..?

హీరో నాని అంటేనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడనే టాక్ నడుస్తూ ఉంటుంది. మొన్ననే 'శ్యామ్ సింగ రాయ్' సినిమా థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు మరో సినిమాను కంప్లీట్ చేశాడు నాని. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' సినిమా షూటింగ్ పూర్తయింది."It's a wrap for the roller coaster movie of the year 'Ante Sundaraniki'," అని ప్రకటించాడు నాని. సెట్స్ చివరి రోజుకు సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా 'అంటే సుందరానికి' ఫస్ట్ లుక్ విడుదలైంది. నాని తన విలక్షణమైన, ఫన్నీ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. నాని ఈ చిత్రంలో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాతో నటి నజ్రియా నజీమ్ ఫహద్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. నికేత్ బొమ్మి ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కాగా.. రవితేజ గిరిజాల ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రంలో నాని, నజ్రియా ఫహద్‌లతో పాటు నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్నారు.


Next Story
Share it