తాళ్లపూడిలో నాని సినిమా షూటింగ్..!

Nani Movie Shooting In Thallapudi. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమా షూటింగ్ తాళ్లపూడిలోని గోదావరి తీరంలో జరుగుతోంది.

By Medi Samrat  Published on  23 March 2021 8:47 AM GMT
Nani Movie Shooting In Thallapudi

నాని ప్రస్తుతం శ్యామ్‌ సింగరాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే..! ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తాళ్లపూడిలోని గోదావరి తీరంలో జరుగుతోంది.

చిత్ర షూటింగ్‌ జరుగుతూ ఉండడంతో సందడి వాతావరణం నెలకొంది. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను గోదావరి తీరం, గోదావరి నదిలో చిత్రీకరించారు. హీరో నాని, హీరోయిన్‌ సాయిపల్లవి ఇతర నటులు రేవు వద్ద నుంచి పడవ దాటే సన్నివేశంతో పాటు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ చూసేందుకు అధిక సంఖ్యలో జనం గోదావరి తీరానికి చేరుకుంటున్నారు.

నాని నటిస్తున్న 27వ సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌'.. 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..! పక్క పాపిడితో మీసాలు మెలితిప్పి న్యూ లుక్‌లో నానిని చూపించారు. టక్ చేసుకుని రెండు చేతులు ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకుని నిలబడగా వెనుకనుండి కౌగలించుకున్న స్త్రీ చేతులు చూపించారు. ఈ సినిమాలో నాని డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని చెబుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.


Next Story
Share it