వారంతం క‌లెక్ష‌న్ల‌పై 'ఘోస్ట్' ఆశ‌లు

Nagarjunna Ghost Movie Collections. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ కు తొలిరోజు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్ర‌మ‌ స్పందన లభించింది.

By Medi Samrat  Published on  7 Oct 2022 11:16 AM IST
వారంతం క‌లెక్ష‌న్ల‌పై ఘోస్ట్ ఆశ‌లు

నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ కు తొలిరోజు విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్ర‌మ‌ స్పందన లభించింది. తొలిరోజు రూ. 3.5 కోటి వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు అంత‌గా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయిందని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వారాంతంలో వ‌సూళ్లు పుంజుకోకపోతే నాగార్జున సినిమాల‌లో తక్కువ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాల జాబితాలో నిలిచిపోనుంది. అక్టోబర్ 5న పలు భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. చిరంజీవి గాడ్‌ఫాదర్‌తో పాటుగా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచింది.

మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది ఘోస్ట్. తొలి రోజు 3.5 కోట్ల‌ రూపాయలు మాత్ర‌మే వసూలు చేసిన ఈ సినిమా.. రెండవ రోజు క‌లెక్ష‌న్లలో మ‌రింత వెనుక‌బ‌డిందని చెబుతున్నారు. అయితే వారాంతంలో అద్భుతమైన క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది చిత్ర యూనిట్‌.

ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహించిన ది ఘోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కింది. ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైనర్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ ముఖేష్, ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల, కంపోజర్లు భరత్-సౌరభ్, మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు సాంకేతిక సిబ్బందిగా ప‌నిచేశారు.


Next Story