నాగార్జున ప్రధానపాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది ఘోస్ట్'. 'ది ఘోస్ట్' చిత్రం అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథనాయిక కాగా, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ ద్వయం, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. కొత్త తరహా సినిమాలను చేసుకుంటూ వెళుతున్న నాగార్జున మరోసారి అందరినీ అలరించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం తెలిసింది. అదేమిటంటే హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమా రెండు రోజులు ఆలస్యంగా అక్కడ విడుదల కాబోతోంది. తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీనే విడుదల చేస్తున్నారు. అయితే హిందీలో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అక్టోబర్ 7న విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. హిందీలో ఈ సినిమాకు 'విక్రమ్ ది ఘోస్ట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే హిందీ రిలీజ్‌ను కాస్త లేటుగా ప్లాన్ చేశారు.