నాగార్జున 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

Nagarjuna Ghost Movie Pre Release Event. అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు.

By Medi Samrat  Published on  23 Sep 2022 2:15 PM GMT
నాగార్జున ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్'. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా టీజర్ ఉండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతూ ఉంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులోని STBC కాలేజీ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 25న సాయంత్రం 6 గంటలకు నిర్వహించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని వారసులైన నాగచైతన్య, అఖిల్‌లు గెస్టులుగా రానున్నారు. ఒకే వేదికపై అక్కినేని హీరోలను మరోసారి చూడబోతున్నారు.

ది ఘోస్ట్ మూవీలో నాగార్జున సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇటీవల నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించారు. నంది అస్త్రం ఉన్న ఆర్టిస్ట్ పాత్రలో నాగార్జున చేసిన కేమియో సినిమాకు ప్లస్ గా మారింది. ఇప్పుడు ఘోస్ట్ సినిమాకు హిందీలో మంచి బిజినెస్ కు అవకాశం ఉండడంతో ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్లు కథనాలు వచ్చాయి. చాలా వరకూ రొటీన్ పాత్రలు కాకుండా విభిన్న కథలు చేసుకుంటూ వెళ్లిపోతున్న నాగార్జున ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటాడని అందరూ ఆశిస్తూ ఉన్నారు.
Next Story
Share it