సమంత ఎదురైతే.. హాయ్‌ చెప్పి హగ్‌ చేసుకుంటా: నాగచైతన్య

Nagachaitanya reveals his arm Tattoo is his and samantha wedding date. నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని బయటపెడ్డాడు. తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి

By అంజి
Published on : 10 Aug 2022 1:08 PM IST

సమంత ఎదురైతే.. హాయ్‌ చెప్పి హగ్‌ చేసుకుంటా: నాగచైతన్య

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య 'లాల్‌ సింగ్‌ చడ్డా' మూవీ ప్రమోషన్స్‌తో బీజీగా ఉన్నాడు. తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని బయటపెడ్డాడు. తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి చైతన్య మాట్లాడారు. ఇంటర్వ్యూలో ''మీ చేతిపై ఉన్న టాటూకు మీనింగ్‌ ఏమిటి? దానిని ఎందుకు వేయించుకున్నారు'' అని అడగగా.. తన చేతి మణికట్టు దగ్గర మాత్రమే పచ్చబొట్టు ఉందని, అదంటె తనకు ఎంతో ఇష్టమని చైతన్య చెప్పారు. సమంతతో వివాహం జరిగిన డేట్‌ని టాటూగా వేయించుకున్నానని, చూసేవారికి అది తేదీ అనే విషయం తెలియదన్నారు.

తన అభిమానులు చాలా మంది ఆ టాటూని కాపీ కొడుతున్నారని చెప్పారు. ఇటీవల తన అభిమానులను కలిశానని, వారిలో కొందమంది తన చేతిపై ఉన్న పచ్చబొట్టుని కాపీ కొట్టి వేయించుకున్నారన్నారు. దయచేసి టాటూ విషయంలో తనను ఫాలో కావొద్దని ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగచైతన్య తన అభిమానులకు సూచించారు. సామ్‌తో విడిపోయిన తర్వాత ఆ పచ్చబొట్టు గురించి తానెప్పుడు ఆలోచించలేదన్నారు. ఎందుకంటే ఈ టాటూ ఉండటం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒక వేళ ఇప్పటికిప్పుడు సమంత ఎదురైతే.. హాయ్‌ చెప్పి హగ్‌ చేసుకుంటానన్నారు. ప్రస్తుతానికి తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.

Next Story