ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరు శాతం శ్రమిస్తా: నాగబాబు
Nagababu Comments On MAA Elections. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకరి
By Medi Samrat Published on 6 Oct 2021 3:18 PM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకరి ప్యానల్ మరో ప్యానల్ పై తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. చీటికీ మాటికీ ప్రెస్ ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితులపై నాగబాబు స్పందించారు. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరు శాతం శ్రమిస్తానని మీడియా ముఖంగా నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రకాశ్‌రాజ్ అంటే కోట, బాబుమోహన్‌కు అంత చులకనా? అని నాగబాబు ప్రశ్నించారు. సినిమాకు రూ. కోటి తీసుకునే దమ్మున్నవాడు ప్రకాశ్‌రాజ్. 'మా' కోసం కొన్ని సినిమాలు వదులుకున్నాడని అన్నారు నాగబాబు. కొన్ని కోట్ల రూపాయాలు వదులుకొని 'మా' కోసం ప్రకాశ్‌రాజ్ వస్తున్నాడు. 'మా'కు సేవ చేస్తానంటే ప్రకాశ్‌రాజ్‌ను కించపరుస్తారా? అని ధ్వజమెత్తారు.
తెలుగువాడినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొందరు అంటున్నారు. తెలుగు నటులు వేరే భాషల్లో నటించట్లేదా? అని అడిగారు. కోట శ్రీనివాస్ రావు తమిళం, కన్నడంలో నటించలేదా? అని ప్రశ్నించారు. 'మా' ఎన్నికల్లో సభ్యులకు డబ్బు ఆశ చూపించడం సరికాదని నాగబాబు అన్నారు. ఒక్కో ఓటరకు రూ. 10 వేలు ఇస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ మాకు మూడు సార్లు అధ్యక్షుడిగా ఉండాలి. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా ఎన్నికైతేనే మా బాగుపడుతుందన్నారు.
ప్రకాశ్ రాజ్ చిన్న, పెద్ద సినిమా వాళ్లకు కావాలని నాగబాబు అన్నారు. ఉత్తమ నటుడిగా ప్రకాశ్‌రాజ్‌ను ఒప్పుకోవాలన్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తాడని అస్సలు ఊహించలేదన్నారు. ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారని నాగబాబు అన్నారు. 'మా' బాగా పాపులర్.. కానీ చాలా చిన్న అసోసియేషన్. మనం ప్రతి సారి ఇలా మీడియా ముందుకు రావలసిన అవసరం లేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళ ఈ దుస్థితి పట్టింది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ శ్రీకృష్ణ పాత్ర ధారి అంటూ నాగబాబు నరేష్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.
అతడు తుమ్మినా ప్రెస్ మీట్.. దగ్గినా ప్రెస్ మీట్.. అసలు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని నాగబాబు ప్రశ్నించారు. ఇక ప్రకాష్ రాజ్ నా కంటే మా అన్నయ్యకు బాగా క్లోజ్. ప్రకాష్ రాజ్ కి , నాకు చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ అది వేరు. మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ ఛాయిస్. చాలా తెలివైన వాడు. ప్రకాష్ రాజ్ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామితో కూడా డిబేట్ లో పాల్గొన్నారని నాగబాబు అన్నారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ మాట్లాడుతున్నారు. అరె బాబు ప్రకాష్ రాజ్ ఇండియన్ నటుడు రా.. అన్ని భాషల్లో నటించాడు అని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపు ఉన్నాడా.. పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాడా అంటూ విష్ణు ప్రశ్నించడం చూశా.. ఆ ప్రశ్న ఏంటి.. కళ్యాణ్ బాబు తెలుగు నటుడు కాదా.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని నాగబాబు అన్నారు.