చైతూ బర్త్ డే గిప్ట్ వ‌చ్చేసింది

Naga Chaithanya Birthday Gift. హీరో నాగ‌చైతన్య న‌టిస్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతో

By Medi Samrat  Published on  23 Nov 2020 11:29 AM IST
చైతూ బర్త్ డే గిప్ట్ వ‌చ్చేసింది

హీరో నాగ‌చైతన్య న‌టిస్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే తిరిగి ప్రారంభ‌మైంది. కాగా.. ఈరోజు నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి మ‌రో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.



ఈ కొత్త పోస్టర్‌లో నాగ చైతన్య బనీన్‌, లుంగీతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌, తొలి పాట‌ను విడుద‌ల చేయ‌గా.. విశేష స్పంద‌న వ‌చ్చింది. నాగచైతన్య , సాయి పల్లవి ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనపడతారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.


Next Story