సమంత గురించి ఫుల్ క్లారిటీతో ఉన్న నాగ చైతన్య

Naga Chaitanya says 'noise' about his personal life 'is louder than' films. నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది

By Medi Samrat
Published on : 31 July 2022 5:15 PM IST

సమంత గురించి ఫుల్ క్లారిటీతో ఉన్న నాగ చైతన్య

నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా అసహనం కలిగిస్తోందని.. తాను ఇక్కడ ఓ నటుడ్ని అని, తన నటనా జీవితం గురించే అందరూ మాట్లాడుకోవాలని కోరుకుంటానని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకోవడాన్ని ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని, 'పర్సనల్' అని ఎందుకు అంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. "నా సినీ జీవితం కంటే వ్యక్తిగత జీవితమే పెద్ద హెడ్ లైన్ గా మారిపోతోందని. సినీ రంగంలో నేను సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది చాలా చికాకు కలిగించే అంశం. దురదృష్టం ఏమిటంటే సినిమా రంగంలో వ్యక్తిగత జీవితం కూడా వార్తావస్తువే అవుతుంది" అని వివరించారు.

తమ వైవాహిక జీవితం ముగించడానికి గల కారణాలు ఏమని చెప్పాలనుకున్నామో వాటిని ఓ ప్రకటన రూపంలో సంయుక్తంగా చెప్పేశామని.. ఇప్పుడు సమంత దారి సమంతదే... నా దారి నాదే... ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు. తాను సినీ రంగంలో సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదని.. ఇది చాలా చికాకు కలిగించే అంశం అని అన్నారు.



Next Story