అమ్మ నాకు అదే నేర్పింది : నాగ చైతన్య

Naga Chaitanya in Sam Jam. సమంత వ్యాఖ్యాతగా ఆహా యాప్ ద్వారా ప్రసారం అవుతున్న సామ్ జామ్ అనే షో లో నాగ చైతన్య.

By Medi Samrat  Published on  10 Jan 2021 12:17 PM IST
Naga Chaitanya in Sam jam

సమంత వ్యాఖ్యాతగా ఆహా యాప్ ద్వారా ప్రసారం అవుతున్న సామ్ జామ్ అనే టాక్ షోలో ప్రముఖ సినీ సెలబ్రిటీస్ పాల్గొంటున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ షో లో భాగంగానే నాగ చైతన్య గెస్ట్ గా ఈ షో కి వచ్చారు. నాగచైతన్య సమంత ఈ షోలో పాల్గొనడం ద్వారా అభిమానులలో తీవ్ర ఆశక్తి నెలకొని ఉంది. సమంత నాగచైతన్యను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాటికి చైతన్య ఎలా సమాధానం చెబుతారనే ఆశక్తి ఏర్పడింది.

ఈ షోలో భాగంగానే సమంత నాగచైతన్య ఉద్దేశించి"మీపై మహిళా ప్రభావం ఎంత మేరకు ఉంది? అంటూ".. ప్రశ్నించగా అందుకు నాగ చైతన్య సమాధానం చెబుతూ.. జీవితంలో ఎలా నడుచుకోవాలో అమ్మ నాకు చెప్పింది. మన జీవితం ఎప్పుడూ కూడా బ్లాక్ అండ్ వైట్ లా ఉండాలి. ఎప్పుడు అటో, ఇటో ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది తీసుకోవాలో తేల్చుకోలేని స్థితిలో మాత్రం ఉండకూడదని నాగ చైతన్య తెలియజేశారు.

అలాగే సమంత మాట్లాడుతూ పెళ్లి అయిన తరువాత తాను సినిమాలు మానేస్తున్నాను అంటూ రూమర్లు వచ్చాయి అని అడగగా.. అందుకు చైతన్య స్పందిస్తూ.. అసలు ఈ సమాజంలో కొందరు వ్యక్తులు స్త్రీ, పురుషులు సమానం కాదని ఎందుకు భావిస్తారు నాకర్థం కాదు. నా దృష్టిలో మాత్రం స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని చైతన్య చెప్పడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య సాగిన ఈ షో ఎంతో ఆసక్తికరంగా నెలకొంది. చైతన్య మహిళా శక్తి గురించి ఎంత గొప్పగా చెప్పిన ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.


Next Story